హైవే ప్రమాదాల నివారణకు NHAI అంబులెన్స్ సేవలు.. హెచ్ఆర్ విశ్వక్ రాజ్ తనిఖీ!

జాతీయ రహదారులపై ప్రయాణించే వారి భద్రతకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అంబులెన్స్ సేవలు శ్రీరామరక్షలా పనిచేస్తాయని ఎన్‌హెచ్‌ఏఐ అంబులెన్స్ విభాగం హెచ్ఆర్ కొప్పోజి విశ్వక్ రాజ్ తెలిపారు.

SHAIKH FIROZ, PUTTAPARTHI
Published on: 29 Jun 2026 6:55 AM IST
Ambulance
X

హైవే ప్రమాదాల నివారణకు NHAI అంబులెన్స్ సేవలు.. హెచ్ఆర్ విశ్వక్ రాజ్ తనిఖీ!

ఓ.డి చెరువు: నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడుస్తున్న ... ఆంబులెన్సులు ప్రయాణికుల భద్రతకు, ప్రాణాలకు శ్రీరామ రక్షలా పనిచేస్తాయని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆంబులెన్స్ల హెచ్ఆర్ కొప్పోజి విశ్వక్ రాజ్ పేర్కొన్నారు. ఈ సందర్భంలో ఓ.డి చెరువు మండలం ఇనగలూరు టోల్ ప్లాజా లో ఆంబులెన్స్ ను విశ్వక్ రాజ్ తనిఖీ చేసి సంతృప్తిని వ్యక్తం చేశారు. ముఖ్యంగా కారు బస్సు డ్రైవర్లతోపాటు ద్విచక్ర వాహనదారులు సైతం హైవేలో ప్రయాణించుచున్న సమయంలో ఏవైనా ప్రమాదాలు సంభవించినప్పుడు తక్షణమే హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నేతృత్యంలో నడుస్తున్న ఆంబులెన్స్ లో తక్షణం వారి ముందు ప్రత్యక్షమై వారి ప్రాణాలకు రక్షగా నిలుస్తాయని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.

ముఖ్యంగా ఈ అంబులెన్సులు అత్యవసర పరిస్థితుల్లో పెను ప్రమాదాలకు గురైనప్పుడు ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు 1033 కు సమాచారం ఇస్తే సకాలంలో చేరుకుని వారికి వైద్య సదుపాయం కల్పించి వారి ప్రాణాలకు భరోసా కల్పిస్తారన్నారు. నేషనల్ హైవే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ అంబులెన్స్ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ అంబులెన్స్ లో ఒక నర్సు, ఒక పైలెట్టు, హెల్పర్ లు ఉంటారన్నారు. ఏమైనా పెను ప్రమాదాలు సంభవించిన సమయాలలో తీవ్రంగా గాయపడిన వారికి అంబులెన్సులలో ఆక్సిజన్ సదుపాయం, మందులు వంటి అధునాతన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. హెచ్ ఆర్ తో పాటు పైలెట్ గుండ్లూరు బాబా ఫక్రుద్దీన్, హెల్పర్ బత్తల శ్రీనివాసులు, జిఎన్ఎమ్ నర్స్ శివమణి లు ఉన్నారు.

SHAIKH FIROZ, PUTTAPARTHI

SHAIKH FIROZ, PUTTAPARTHI

Next Story