Anantapur: నూతన ఎమ్మెల్సీ వడ్డె దళవాయి రమాదేవికి అనంతపురంలో ఘన స్వాగతం!
Anantapur: గవర్నర్ కోటా ఎమ్మెల్సీ వడ్డె దళవాయి రమాదేవికి అనంతపురంలో ఘన స్వాగతం. ఎమ్మెల్యే దగ్గుపాటి, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో కలిసి భారీ ర్యాలీ.
Anantapur: నూతన ఎమ్మెల్సీ వడ్డె దళవాయి రమాదేవికి అనంతపురంలో ఘన స్వాగతం!
Anantapur: గవర్నర్ కోటాలో ఎవరూ ఊహించని విధంగా ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకున్న నూతన ఎమ్మెల్సీ వడ్డె దళవాయి రమాదేవికి అనంతపురం జిల్లాలో ఘన స్వాగతం లభించింది. పదివి దక్కిన తర్వాత తొలిసారిగా జిల్లాకు విచ్చేసిన ఆమెకు వడ్డెర్లు, బీసీ సంఘాల నాయకులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు అత్యంత ఉత్సాహంతో నీరాజనాలు పలికారు.
జిల్లాకు చేరుకున్న ఎమ్మెల్సీ రమాదేవి, ముందుగా ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మరియు తన కుటుంబ సభ్యులతో కలిసి బాటలో ఉన్న సుంకులమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అనంతపురంలోని తపోవనం జంక్షన్ వద్దకు చేరుకున్న ఆమెకు వడ్డెర కులస్థులు, బీసీ నాయకులు భారీ గజమాలతో ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుండి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో కలిసి నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు.
ఎమ్మెల్సీ వడ్డె దళవాయి రమాదేవి మాట్లాడుతూ..
"బీసీల్లో అత్యంత అట్టడుగున ఉన్న వడ్డెర సామాజిక వర్గానికి చెందిన నాలాంటి సాధారణ మహిళకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం ఎంతో సంతోషకరం. ఒక సాధారణ క్లస్టర్ ఇన్ ఛార్జిగా ఉన్న నాకు ఈ పదవి దక్కడంలో ఎమ్మెల్యే దగ్గుపాటి కృషి ఎంతో ఉంది. ఆయనకు నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. నా వడ్డెర కులస్థులు నా వెన్నంటే ఉండి ప్రోత్సహించారు, వారి సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తాను."
ఎమ్మెల్యే మాట్లాడుతూ..అనంతపురం ఆడబిడ్డకు ఎమ్మెల్సీగా అవకాశం రావడం జిల్లాకే గర్వకారణమని పేర్కొన్నారు. బీసీలంటే టీడీపీ, టీడీపీ అంటేనే బీసీలని ఈ నిర్ణయంతో మరోసారి నిరూపితమైందన్నారు.పార్టీలో క్రమశిక్షణతో పని చేస్తే ఎవరికైనా తగిన గుర్తింపు లభిస్తుంద అనడానికి దలవాయి రమాదేవే నిదర్శనమని చెప్పారు.
ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అనంతపురం జిల్లాపై ప్రత్యేకమైన అభిమానం ఉందని, అందులో భాగంగానే పిలిచి మరీ ఒక బీసీ మహిళకు ఈ గొప్ప అవకాశం ఇచ్చారని తెలియజేశారు.




