Nallamada: గుక్కెడు నీటి కోసం ఖాళీ బిందెలతో మహిళల రోడ్డు దిగ్బంధం!

Nallamada: శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం రెడ్డిపల్లిలో తాగునీటి సమస్యపై ఖాళీ బిందెలతో మహిళల నిరసన. అధికారులు తక్షణమే స్పందించి పరిష్కరించాలని డిమాండ్.

S.Firoz, Sri Sathya Sai
Published on: 1 Sept 2026 11:37 AM IST
Nallamada
X

Nallamada: గుక్కెడు నీటి కోసం ఖాళీ బిందెలతో మహిళల రోడ్డు దిగ్బంధం!

Nallamada:వర్షాకాలం వచ్చినా తాగునీటి కష్టాలు తప్పడం లేదని శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజులుగా గ్రామంలో తాగునీటి సరఫరా సక్రమంగా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పేర్కొంటూ మహిళలు ఖాళీ బిందెలతో ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు.

తాగునీటి సమస్యను పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. రోజువారీ అవసరాలకు సైతం నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని తెలిపారు.

“గుక్కెడు నీటి కోసం ఇన్ని ఇబ్బందులా?” అంటూ మహిళలు ప్రశ్నించారు. వెంటనే గ్రామంలోని తాగునీటి సమస్యను పరిష్కరించి, క్రమం తప్పకుండా నీటి సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.

సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ నిరసనను ఓటు ద్వారా తెలియజేస్తామని మహిళలు హెచ్చరించారు. అధికారులు స్పందించి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు కోరుతున్నారు.

S.Firoz, Sri Sathya Sai

S.Firoz, Sri Sathya Sai

Next Story