Anantapur: మధ్యాహ్న భోజనంలో కుళ్లిన గుడ్లు.. కలెక్టర్‌కు ఎమ్మెల్సీ ఫిర్యాదు!
Anantapur: శ్రీ సత్యసాయి జిల్లాల్లో మధ్యాహ్న భోజన పథకంలో కుళ్లిన గుడ్లు, ఎక్స్‌పైరీ చిక్కీలు సరఫరా చేస్తున్నారంటూ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
Anantapur: మధ్యాహ్న భోజనంలో కుళ్లిన గుడ్లు.. కలెక్టర్‌కు ఎమ్మెల్సీ ఫిర్యాదు!
అనంతపూర్: ఉమ్మడి అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో మధ్యాహ్న భోజన పథకం అమలులో తీవ్ర అవకతవకలు జరుగుతున్నాయని పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆరోపించారు. పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న కోడిగుడ్లు, చిక్కిల సరఫరాలో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుందని ఆయన మండిపడ్డారు. ఈ వ్యవహారంపై అనంతపురం జిల్లా కలెక్టర్‌కు అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు.
కుళ్లిన గుడ్లు.. ఎక్స్‌పైరీ అయిన చిక్కీలు!
గార్లదిన్నె మండలంలోని పలు పాఠశాలలను ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి స్వయంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలకు కోడిగుడ్ల సరఫరా సరిగ్గా జరగడం లేదని ఉపాధ్యాయులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. "పాఠశాలల్లో గుడ్ల సరఫరా నిలిచిపోయిన విషయంపై ఉపాధ్యాయులు పలుమార్లు ఉన్నతాధికారులకు, కాంట్రాక్టర్లకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు." ఈ తీవ్రమైన సమస్యను జిల్లా సర్వసభ్య సమావేశంలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్సీ తెలిపారు.
ఎమ్మెల్సీ ఫిర్యాదుపై తక్షణమే స్పందించిన జిల్లా కలెక్టర్.. ముగ్గురు జిల్లా స్థాయి అధికారులతో కూడిన ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేశారని ఎమ్మెల్సీ తెలిపారు.విచారణ అధికారులు జిల్లాలోని 9 పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించి, సరఫరాలో జరుగుతున్న ఘోర తప్పిదాలను గుర్తించారు. సదరు కాంట్రాక్టర్లు పాఠశాలలకు కుళ్ళిపోయిన కోడిగుడ్లను, ఎక్స్‌పైరీ డేట్ (గడువు) ముగిసిపోయిన చిక్కీలను సరఫరా చేస్తున్నట్లు అధికారులు తమ నివేదికలో నిర్ధారించారు. ఈ నివేదికను కలెక్టర్‌కు సమర్పించారు.
తక్షణ చర్యలకు డిమాండ్ చేశారు..
చిన్నారుల ఆరోగ్యంతో ఆడుకుంటూ, ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టిస్తున్న ఈ అవినీతి తిమింగలాలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. నివేదిక ద్వారా అవినీతి రుజువైనందున, బాధ్యులైన కాంట్రాక్టర్లు, అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన కలెక్టర్‌ను విజ్ఞప్తి చేశారు.




