Anantapur: అనంతపురం తోపుదుర్తికి ఎం.ఎస్. రాజు ఘాటు సవాల్

Anantapur: తనపై, నారా లోకేష్‌పై అసత్య ఆరోపణలు చేసిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి ఎం.ఎస్. రాజు సవాల్. ఆరోపణలు నిరూపించాలని గడువు ఇచ్చినా స్పందించని వైనం.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 9 July 2026 7:33 PM IST
Anantapur
X

Anantapur: అనంతపురం తోపుదుర్తికి ఎం.ఎస్. రాజు ఘాటు సవాల్

అనంతపూర్: దళితుడినైనా నా ఆత్మగౌరవానికి భంగం కలిగేలా మాట్లాడి, కించపరిచిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని మడకశిర శాసనసభ్యులు, టీటీడీ పాలకమండలి సభ్యులు మరియు శ్రీసత్యసాయిజిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు ఎం.ఎస్.రాజు అన్నారు.

ఎం.ఎస్.రాజుకు రూ.7కోట్ల విల్లా ఉందని, బెంగళూరులో ఆస్తులు ఉన్నాయని, మంత్రి నారా లోకేష్ గారికి బినామీగా ఉన్నారని చేసిన అసత్య ఆరోపణలపై ఎం.ఎస్.రాజు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై మండిపడ్డారు.

తనపై చేసిన ఆరోపణలను గురువారం సాయంత్రం 5గంటల్లోపు నిరూపించాలని ఎం.ఎస్.రాజు సవాల్ విసిరారు. తాను విసిరిన సవాల్ పై తోపుదుర్తి స్పందించకపోవడంపై ఎం.ఎస్.రాజు అనంతపురంలోని తన నివాసం వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం.ఎస్.రాజు మాట్లాడుతూ..

తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వైసీపీలో తన ఉనికిని కాపాడుకునేందుకు మా యువనేత నారా లోకేష్ గారిపై, మాపై అసత్య ఆరోపణలు చేశాడు. మా ఎమ్మెల్యేలు, మా యువనేతపై ఇష్టానుసారి మాట్లాడిన వారిని వ్యతిరేకించాల్సిన అవసరం ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నాపై ఉంది.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story