Kadiri: ప్రజల చెంతకే పాలన.. పింఛన్లు ఇళ్ల స్థలాల అర్జీలపై కదిరి ఎమ్మెల్యే

Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలం మోటుకుపల్లిలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రజా దర్బార్ నిర్వహించారు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 21 May 2026 1:38 PM IST
Kadiri
X

Kadiri: ప్రజల చెంతకే పాలన.. పింఛన్లు ఇళ్ల స్థలాల అర్జీలపై కదిరి ఎమ్మెల్యే

కదిరి: సత్య సాయి జిల్లా కదిరి రూరల్ మండలం మోటుకుపల్లి గ్రామంలో ప్రజా దర్బార్ నిర్వహించారు ఎమ్మెల్యే వెంకటప్రసాద్. అర్జీలు ఇవ్వడానికి వచ్చిన ప్రజలతో మాట్లాడి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు సమర్పించిన వినతులను క్షుణ్ణంగా పరిశీలించి మెజారిటీ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.

రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, కొత్త పింఛన్లు, గ్రామంలో రోడ్డు సమస్యలపై అర్జీలు రావడంతో, సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల చెంతకే పాలనను తీసుకెళ్లే విధంగా,ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కరించేవరకూ తన కృషి ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు కదిరి ఎమ్మెల్యే వెంకటప్రసాద్.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI

Next Story