Kadiri: ధర్మవరంలో "నేతన్న సేవ" వేడుకలు: పాల్గొన్న కదిరి ఎమ్మెల్యే!

Kadiri: ధర్మవరంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నిర్వహించిన "నేతన్న సేవ" కార్యక్రమంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 7 Aug 2026 7:35 PM IST
Kadiri
X

Kadiri: ధర్మవరంలో "నేతన్న సేవ" వేడుకలు: పాల్గొన్న కదిరి ఎమ్మెల్యే!

కదిరి: జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్యసాయి జిల్లా ధర్మవరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన "నేతన్న సేవ" కార్యక్రమంలో కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, చేనేత కార్మికుల సంక్షేమం మరియు చేనేత రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఇప్పటికే ప్రతి ఏడాది రూ.150 కోట్లతో ఉచిత విద్యుత్, రూ.420 కోట్లతో 50 సంవత్సరాలు నిండిన 85 వేల మంది చేనేత కార్మికులకు పింఛన్లు, 109 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్ ద్వారా రూ.79 కోట్ల ఆర్థిక సహాయం అందించిన ప్రభుత్వం, తాజాగా రూ.179 కోట్ల వ్యయంతో "నేతన్న సేవ" పథకాన్ని ప్రారంభించడం ద్వారా చేనేత కుటుంబాల సంక్షేమానికి మరో ముందడుగు వేసిందని పేర్కొన్నారు.

చేనేత వృత్తిని ఆదుకోవడం, నేతన్నల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, వారికి ఆర్థిక భరోసా కల్పించడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్, జనసేన పార్టీ ధర్మవరం ఇంచార్జి చిలకం మధుసూదన్ రెడ్డి, చేనేత సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, చేనేత కార్మికులు మరియు ధర్మవరం ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI

Next Story