Kadiri: కదిరిలో క్రీడా పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే కందికుంట!
Kadiri: కదిరి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ‘అమరావతి ఛాంపియన్‌షిప్–2026’ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్. క్రీడాస్ఫూర్తిని చాటాలని పిలుపు.
Kadiri: కదిరిలో క్రీడా పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే కందికుంట!
Kadiri: అమరావతి ఛాంపియన్‌షిప్ – 2026లో భాగంగా నిర్వహిస్తున్న క్రీడా పోటీలను సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, యువతలో క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించడంలో ఇలాంటి క్రీడా పోటీలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. క్రీడాకారులు విజయం–పరాజయాలను సమానంగా స్వీకరిస్తూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో కదిరి పేరు నిలబెట్టాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, ఉపాధ్యాయులు, అధికారులు, పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు.
Next Story




