Anantapur: రాయదుర్గంలో ముమ్మరంగా 'ఇంటింటికి టీడీపీ' కార్యక్రమం!
Anantapur: అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు 'ఇంటింటికి టీడీపీ' కార్యక్రమం నిర్వహించారు.
Anantapur: రాయదుర్గంలో ముమ్మరంగా 'ఇంటింటికి టీడీపీ' కార్యక్రమం!
Anantapur: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికీ చేరవేస్తున్నామని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు.
రాయదుర్గం పట్టణంలోని 15వ వార్డులో ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను కలుసుకుంటూ.. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
అదే సమయంలో ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం నుంచి ప్రజలు ఇంకా ఎలాంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆశిస్తున్నారో నేరుగా ప్రజల నుంచే తెలుసుకున్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఇంటికీ ఏదో ఒక రూపంలో సంక్షేమం అందుతోందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రజలు నిండు మనసుతో ఆశీర్వాదాలు అందిస్తున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మరింత కాలం కొనసాగాలని, అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారని ఎమ్మెల్యే అన్నారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల మధ్యే ఉంటుందని కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ.. ప్రజలతో మమేకమై పనిచేసే అద్భుతమైన రాజకీయ పార్టీ టీడీపీ అని కొనియాడారు.
ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడం, ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రతి కుటుంబానికి చేరవేయడం, రాయదుర్గం నియోజకవర్గ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు.




