Anantapur: 'ఇంటింటికీ కూటమి ప్రభుత్వం' కార్యక్రమం!
Anantapur: మంత్రి నారా లోకేష్‌పై విమర్శలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారు.
Anantapur: 'ఇంటింటికీ కూటమి ప్రభుత్వం' కార్యక్రమం!
Anantapur: రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌పై నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని, వైసీపీ నాయకులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ హెచ్చరించారు.
నగరంలోని 47వ డివిజన్ రంగస్వామి నగర్‌లో నిర్వహించిన 'ఇంటింటికీ కూటమి ప్రభుత్వం' కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్‌తో కలిసి డివిజన్‌లోని ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వంలో గత రెండేళ్లలో జరిగిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. 'తల్లికి వందనం'తో పాటు పలు పథకాల అమలు పట్ల ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని, ఏ ఇంట చూసినా కూటమి పాలనపై పూర్తి సంతృప్తి వ్యక్తం అవుతోందని ఎమ్మెల్యే దగ్గుపాటి తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ...
రాష్ట్రాన్ని గాడిలో పెట్టిన సీబీఎన్ బ్రాండ్: గత ఐదేళ్ల పిచ్చి తుగ్లక్ పాలనతో ధ్వంసమైన రాష్ట్రాన్ని, సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తన సుదీర్ఘ అనుభవంతో తిరిగి గాడిలో పెట్టారని చెప్పారు. 'సీబీఎన్ బ్రాండ్' ఇమేజ్‌తో మంత్రి నారా లోకేష్ గారు రాష్ట్రానికి ఏకంగా రూ. 25 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చారని కొనియాడారు.
రాయలసీమ, అనంతపురానికి ప్రాధాన్యం ఒక్క రాయలసీమ ప్రాంతానికే రూ. లక్ష కోట్లు కేటాయించేలా ప్రణాళికలు రూపొందించగా, ఉమ్మడి అనంతపురం జిల్లాకు రూ. లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు. అంతేకాకుండా పుట్టపర్తి ప్రాంతంలో 5వ జనరేషన్ ఫైటర్ జెట్ల తయారీ పరిశ్రమను నెలకొల్పడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
రూ. 1290 కోట్ల అభివృద్ధి మెగా డీఎస్సీ ఈ రెండేళ్ల వ్యవధిలోనే అనంతపురం నియోజకవర్గంలో రూ. 1,290 కోట్లతో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. అలాగే నిరుద్యోగుల కల నెరవేరుస్తూ మెగా డీఎస్సీ ద్వారా 16,437 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు.
మెగా డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు పొందిన ఏడాదిన్నర తర్వాత, వైసీపీ నాయకులు ఏదో జరిగిపోయిందంటూ 'డైవర్షన్ పాలిటిక్స్' ప్రారంభించారని ఎమ్మెల్యే దగ్గుపాటి విమర్శించారు. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారని, మొదటి నుంచీ 'గొడ్డలి పార్టీ'కి ఇలాంటి దుష్ప్రచారాలు అలవాటేనని మండిపడ్డారు. 30-40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే పెద్దలు కూడా ఈ తరహా అబద్ధాలను ప్రచారం చేయడం విచారకరమన్నారు. ఇకనైనా మంత్రి లోకేష్‌పై, ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేయడం మానుకోకపోతే ప్రజాక్షేత్రంలో బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




