Anantapur: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వేడుకల్లో కేక్ కట్ చేసిన తెదేపా!
Anantapur: అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పుట్టినరోజు వేడుకలను టవర్ క్లాక్ వద్ద తెదేపా నాయకులు, అభిమానులు ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేశారు.
Anantapur: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వేడుకల్లో కేక్ కట్ చేసిన తెదేపా!
Anantapur: అనంతపురం శాసనసభ్యులు శ్రీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా అనంతపురం నగరంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు.
అనంతపురం అర్బన్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక టవర్ క్లాక్ వద్దకు భారీ ఎత్తున అభిమానులు చేరుకుని, అక్కడ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ భారీ కటౌట్ ముందుకు విచ్చేశారు. పండుగ వాతావరణంలో ఎమ్మెల్యే దగ్గుపాటి భారీ కటౌట్ ఎదుట నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అనంతపురం నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా అహర్నిశలు శ్రమిస్తున్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. తమ ప్రియతమ నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జై తెలుగుదేశం, జై దగ్గుపాటి ప్రసాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.




