Penukonda: ఆరోజు చెప్పాను ఈరోజు చేసి చూపించాను మంత్రి సవిత!
Penukonda: శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలంలో రూ. 5.40 కోట్ల అభివృద్ధి పనులను మంత్రి ఎస్. సవిత ప్రారంభించారు. పంచాయతీల వారీగా అభివృద్ధిపై చర్చకు సిద్ధమని సవాల్.
Penukonda: ఆరోజు చెప్పాను ఈరోజు చేసి చూపించాను మంత్రి సవిత!
Penukonda: ‘రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నాం అభివృద్ధిపై పంచాయతీ స్థాయిలోనైనా చర్చకు సిద్ధంగా ఉన్నాం కల్లుతాగిన కోతిలా కుప్పిగెంతులు వేస్తూ అభివృద్ధిపై, సంక్షేమంపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదు ’ అని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ,చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత హెచ్చరించారు.
అయిదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క రోడ్డయినా వేశారా..? అని నిలదీశారు. ఆరోజు చెప్పాను ఈరోజు చేసి చూపించాను అంటూ పరిగి మండలం కాలువపల్లి గ్రామంలో రూ. 42 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణంపై మాట నిలబెట్టుకున్నట్లు తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తలు కాలర్ ఎగరేసేలా సీఎం చంద్రబాబునాయుడు పాలన సాగిస్తున్నారని ఆనందం వ్యక్తంచేశారు.
పరిగి మండలంలో రూ.5.40 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజలు, ప్రారంభోత్సవాలను మంత్రి సవిత శుక్రవారం చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభల్లో ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నామన్నారు.
తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీ, ఫ్రీ బస్, ఉచిత ఇసుక, పెన్షన్లు పెంపు వంటి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నామన్నారు ప్రతి గ్రామంలోనూ బీటీ రోడ్లు, సీసీ రోడ్లు నిర్మిస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లను, గురుకులాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. నూతన నిర్మాణాలు సైతం చేపట్టామన్నారు.
త్వరలో నూతన పెన్షన్లు, ఇళ్ల స్థలాలు సైతం అందజేయనున్నట్లు తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తలు కాలర్ ఎగరేసేలా సీఎం చంద్రబాబునాయుడు పాలిస్తున్నారని మంత్రి సవిత కొనియాడారు.
తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదు
అయిదేళ్ల పాలనలో కనీసం ఒక్క రోడ్డయినా నిర్మించారా..? అని మంత్రి సవిత ప్రశ్నించారు. దోచుకోవడం, దాచుకోవడమే లక్ష్యంగా వైసీపీ పాలకుల పాలన సాగిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పాలన సాగిస్తున్నామన్నారు. వైసీపీ పాలన, రెండేళ్ల కూటమి పాలనలో పంచాయతీల్లో జరిగిన అభివృద్ధిపైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు.
సీఎం చంద్రబాబు పాలనపైనా, అభివృద్ధి, సంక్షేమంపైనా తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కళ్లు తాగిన కోతిలా కుప్పిగెంతులు వేస్తున్న వైపీపీ నేతలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమంపై ప్రజల్లో చర్చ జరిగేలా కూటమి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు.
ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ప్రతి కుటుంబానికి రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని వివరించాలని మంత్రి సవిత దిశా నిర్దేశం చేశారు.
కాలువపల్లి వాసులకిచ్చిన మాటను నిలబెట్టుకున్నాను
ఎన్నికల ముందు కాలువపల్లి గ్రామస్తులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నానని , రోడ్డు నిర్మించిన తరవాతే గ్రామానికి వస్తానని చెప్పిన విషయాన్ని మంత్రి సవిత గుర్తు చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడుతూ ఆరోజు చెప్పాను ఈరోజు చేసి చూపించాలను అంటూ కాలువపల్లి గ్రామంలో రూ.42 లక్షతో నిర్మించనున్న నూతన బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
అన్ని గ్రామాల్లోనూ రహదారులు నిర్మిస్తున్నామన్నారు. పరిగి మండలంలో పర్యటన సందర్బంగా రూ.5.40 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజలు, ప్రారంభోత్సవాలను మంత్రి చేశారు. శ్రీరంగరాజుపల్లి పంచాయితీ పాపిరెడ్డిపల్లి గ్రామానికి రూ.కోటితో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు.
గ్రామంలో రూ.7 లక్షలతో నిర్మించిన ఎన్టీఆర్ సృజల స్రవంతి తాగునీటి కేంద్రాన్ని ప్రారంభించారు. శ్రీరంగరాజుపల్లి తాతయ్య దర్గా దగ్గర నుంచి చెర్లోపల్లి గ్రామం వరకు రూ. 4.11 కోట్లతో చేపట్టిన బీటీ రోడ్డు పనులకు మంత్రి సవిత భూమి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




