Penukonda: అధికారులతో మంత్రి సవిత సమీక్ష: రొద్దం మండల అభివృద్ధిపై దిశానిర్దేశం!
Penukonda: పెనుకొండ క్యాంపు కార్యాలయంలో రొద్దం మండల ముఖ్య నాయకులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖల మంత్రి సవిత.
Penukonda: అధికారులతో మంత్రి సవిత సమీక్ష: రొద్దం మండల అభివృద్ధిపై దిశానిర్దేశం!
పెనుకొండ: పెనుకొండ క్యాంపు కార్యాలయంలో రొద్దం మండల ముఖ్య నాయకులు, మండల అధికారులతో రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖల మంత్రి సవిత సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలో నెలకొన్న ప్రధాన సమస్యలు, త్వరలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు.
ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ప్రజలకు అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని సత్వరమే పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా సమన్వయంతో పనిచేయాలని అధికారులకు మంత్రి సవిత ఆదేశించారు.
మండలంలో చేపడుతున్న అభివృద్ధి పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించి, నిర్ణీత సమయంలో పనులను పూర్తి చేయాలని ఆమె స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తే మండలాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లవచ్చని మంత్రి సవిత పేర్కొన్నారు.




