Anantapur: మంత్రి నారా లోకేష్ అనంతపురం పర్యటన.. షెడ్యూల్ ఖరారు!
Anantapur: మంత్రి నారా లోకేష్ తొలిసారి అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు.
Anantapur: మంత్రి నారా లోకేష్ అనంతపురం పర్యటన.. షెడ్యూల్ ఖరారు!
Anantapur: తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో మంత్రి నారా లోకేష్ తొలిసారి అనంతపురం జిల్లాకు రానున్నారు. లోకేష్ పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, అబ్జర్వర్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఉమ్మడి జిల్లా పర్యటనలో భాగంగా ఈనెల 14, 15 తేదీల్లో మంత్రి లోకేష్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని ఎమ్మెల్యే దగ్గుపాటి తెలిపారు. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో తొలిసారి జిల్లాకు వస్తున్న నేపథ్యంలో భారీగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
జిల్లాకు జీవనాడి లాంటి ఆర్డిటికీ ఎఫ్.సి.ఆర్.ఏ రెన్యువల్ చేయించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ చాలా కీలకపాత్ర పోషించారని అన్నారు. పట్టు వదలని విక్రమార్కుడిలా మంత్రి లోకేష్ ఎఫ్.సి.ఆర్.ఏ రెన్యువల్ చేయించారన్నారు. ఆయన తండ్రికి తగ్గ తనయుడు నిరూపించుకున్నారన్నారు. సుమారు 1500 మంది నాయకులు, కార్యకర్తలతో మంత్రి లోకేష్ సమావేశం నిర్వహిస్తారని.. పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులంతా కష్టపడి పని చేస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు వివరించారు.




