Anantapur: మైనింగ్, ఎక్సైజ్ శాఖల్లో సమూల ప్రక్షాళన: మంత్రి కొల్లు రవీంద్ర

Anantapur: గత ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్న మైనింగ్, ఎక్సైజ్ శాఖలను కూటమి ప్రభుత్వం పూర్తిగా ప్రక్షాళన చేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 23 May 2026 9:47 AM IST
Anantapur
X

Anantapur: మైనింగ్, ఎక్సైజ్ శాఖల్లో సమూల ప్రక్షాళన: మంత్రి కొల్లు రవీంద్ర

Anantapur: గత ప్రభుత్వ హయాంలో భ్రష్టు పట్టిన మైనింగ్, ఎక్సైజ్ శాఖలను కూటమి ప్రభుత్వం పూర్తిగా ప్రక్షాళన చేస్తోందని రాష్ట్ర మైనింగ్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. అనంతపురం కలెక్టరేట్ నందు మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఉచిత ఇసుక సరఫరా, కొత్త మద్యం విధానం, రాష్ట్రంలో రాబోయే భారీ ప్రాజెక్టుల గురించి కీలక వివరాలను వెల్లడించారు.ప్రజల కోసమే 'ఉచిత ఇసుక' విధానం.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రజల సౌకర్యార్థం ఉచిత ఇసుక విధానాన్ని తీసుకువచ్చారని మంత్రి తెలిపారు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం లేకపోయినా, నామమాత్రపు రుసుముతోనే ప్రజలకు ఇసుక అందిస్తున్నామని తెలిపారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే 3 లక్షల టన్నుల ఇసుకను ప్రజలకు అందించాం. దీనివల్ల ప్రభుత్వానికి రావలసిన రూ.30 కోట్ల ఆదాయాన్ని వదులుకుని ప్రజలకు మేలు చేశాం.కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కమిటీల ద్వారా ఇసుక రీచ్‌లు, డీసిల్టేషన్ పాయింట్లను పర్యవేక్షిస్తున్నాం. అక్రమాలకు తావులేకుండా మైనింగ్ అధికారులు పకడ్బందీగా వ్యవహరించాలి.మైనింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు ఒడిశా తర్వాత దేశంలోనే అత్యధిక ఐరన్ ఓర్ (ఇనుప ఖనిజం) సామర్థ్యం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని మంత్రి గుర్తుచేశారు. ఈ రంగంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు.

కొత్త గనులు & టెండర్లు జొన్నగిరిలో ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా గోల్డ్ మైనింగ్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. రామగిరి ప్రాంతంలో కొత్త గనుల కోసం త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేస్తాం అని తెలిపారు. అనంతపురం జిల్లాలోని కలర్ గ్రానైట్ సమస్యలను పరిష్కరిస్తాం. కర్ణాటక సరిహద్దుతో ఉన్న రాయల్టీ వివాదాలను కూడా సర్దుబాటు చేస్తామన్నారు. మద్యం పాలసీలో పారదర్శకత నాణ్యతకు పెద్దపీట వేసాము. గత ప్రభుత్వంలో ఎక్సైజ్ పాలసీ అధ్వాన్నంగా ఉండేదని, వారు చెప్పిన బ్రాండ్లను మాత్రమే అమ్మి ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేశారని మంత్రి మండిపడ్డారు.

గత ప్రభుత్వం మద్యం వ్యాపారంలో దాదాపు రూ.15,000 కోట్ల కుంభకోణానికి పాల్పడిందన్నారు. దళారులు దోచుకునే ఆ పాత పద్ధతికి స్వస్తి పలికాం.వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బురద చల్లే మాటలు మాట్లాడుతున్నారని మంత్రి విమర్శించారు. అమరావతి రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా మరిన్ని భూములు ఇవ్వడానికి ముందుకు వస్తుంటే, జగన్ వారిని తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని, ప్రజలు ఈ రాజకీయాలను గమనించాలని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story