Anantapur: పామిడి ప్రభుత్వ ఆసుపత్రిలో మిలాద్-ఉన్-నబీ వేళ ఘనంగా అన్నదానం!
Anantapur: పామిడి ప్రభుత్వ ఆసుపత్రిలో మిలాద్-ఉన్-నబీ సందర్భంగా నాగిరెడ్డి కాలనీ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో రోగులు, సిబ్బందికి ఘనంగా అన్నదానం నిర్వహించారు.
Anantapur: పామిడి ప్రభుత్వ ఆసుపత్రిలో మిలాద్-ఉన్-నబీ వేళ ఘనంగా అన్నదానం!
అనంతపురం: అనంతపురం జిల్లా, పామిడి మిలాద్-ఉన్-నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని పామిడి ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పామిడి నాగిరెడ్డి కాలనీ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆసుపత్రికి వచ్చిన రోగులు, ప్రజలు మరియు ఆసుపత్రి సిబ్బందికి అన్నదానం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఇంచార్జ్ డాక్టర్ మహేష్ , డాక్టర్ శివ కార్తి రెడ్డి , ఆసుపత్రి కమిటీ మెంబర్ చిలకల రాజగోపాల్ , నాగిరెడ్డి కాలనీ మిలాద్ కమిటీ సభ్యులు షేక్షావలి, బాబా, షామీర్, నబీ, దూద్, పెయింటర్ షేక్షా, ఫయాజ్, ముజ్జు, పీరా, దాదా ఖలందర్ తదితరులు పాల్గొన్నారు. మానవ సేవే మాధవ సేవ అని, ప్రవక్త మహమ్మద్ బోధనలను స్మరించుకుంటూ ఈ సేవా కార్యక్రమం చేశామని కమిటీ సభ్యులు తెలిపారు.




