Kadiri: ఘనంగా జిల్లా స్థాయి గవర్నమెంట్ టీచర్స్ టోర్నమెంట్!

Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జిల్లా స్థాయి గవర్నమెంట్ టీచర్స్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 2 Aug 2026 7:07 PM IST
Kadiri
X

Kadiri: ఘనంగా జిల్లా స్థాయి గవర్నమెంట్ టీచర్స్ టోర్నమెంట్!

కదిరి: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా NYPSN వ్యవస్థాపక చైర్మన్ మరియు సిమ్స్ హాస్పిటల్ ఎండి నిసార్ యాసిన్ ఖాన్ సౌజన్యంతో జిల్లా స్థాయి గవర్నమెంట్ టీచర్స్ టోర్నమెంట్ కదిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఘనంగా నిర్వహించారు.

మొదటి మ్యాచ్ లో తలుపుల జట్టుపై కదిరి జట్టు విజయం సాధించగా ఇందులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రాంబాబుకు లభించింది. రెండో మ్యాచ్ అమడగూరు జట్టు పై నల్లమాడ జట్టు విజయం సాధించింది. ఇందులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సంతోష్ కు లభించింది.

మూడో మ్యాచ్లో ఎన్ పి కుంట జట్టు-2 పై ముదిగుబ్బ జట్టు విజయం సాధించింది. ఇందులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రవి నాయక్ కు లభించింది.నాలుగో మ్యాచ్లో నల్లచెరువు జట్టుపై గాండ్లపెంట జట్టు విజయం సాధించింది. ఇందులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ హబీబుల్లా కు లభించింది.

బహుమతులు prtu నాయకుడు శ్రీధర్ రెడ్డి, హెడ్మాస్టర్ భాస్కర్ రెడ్డి, రిటైర్డ్ టీచర్ యూటీఎఫ్ నాయకుడు మైనుద్దీన్, రిటైర్డ్ హెడ్మాస్టర్ ఖాదర్ వలీ వీరందరికీ ట్రోఫీలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో నిర్వాహకులు రుద్రం రెడ్డి, శ్రీనివాసులు, అశ్వర్థ, శంకర్, సురేష్, ఆజం, మహేందర్ రెడ్డి, రబ్బాని తో పాటు వివిధ సంఘాల యూనియన్ నాయకులు గంగాధర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, హరి ప్రసాద్, మరియు టీచర్లు పాల్గొన్నారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI

Next Story