Chennekothapalli: చెన్నేకొత్తపల్లిలో బాధితుల ధర్నా.. పోలీసుల ఎంట్రీ
Chennekothapalli: శ్రీ సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో కీర్తన గోల్డ్ లోన్ ప్రైవేట్ బ్యాంక్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది.
Chennekothapalli: చెన్నేకొత్తపల్లిలో బాధితుల ధర్నా.. పోలీసుల ఎంట్రీ
చెన్నేకొత్తపల్లి: శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలో కీర్తన గోల్డ్ లోన్ ప్రైవేట్ బ్యాంక్ నిర్వాకం. బ్యాంక్ ముందు కీర్తన బ్యాంక్ ఖాతాదారులు ధర్నా.. బ్యాంక్ యాజమాన్యం మోసం చేసిందంటూ నినాదాలు చేస్తూ.. ఆవేదన వ్యక్తం చేస్తూ. నిరసన తెలిపిన కీర్తన బ్యాంక్ ఖాతా దారులు. అవసరాల నిమిత్తం తమ బంగారును బ్యాంక్ లో తనఖా పెట్టీ డబ్బును తీసుకుని .. తిరిగి డబ్బు ను బ్యాంక్ కు చెల్లిస్తే బంగారు ఇవ్వలేదని బ్యాంక్ యాజమాన్యం పై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధిత ఖాతాదారులు.
బంగారు బ్యాంక్ లో తనఖా పెట్టుకుని, డబ్బు ఇవ్వటం వరకే తమ విధి అంటూ నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్న కీర్తన బ్యాంక్ ఉద్యోగులు. అధికారుల నుండి స్పందన లేక పోవటంతో విసిగిన బాధిత కుటుంబాలు తమకు న్యాయం చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు. సినిమా స్టైల్ లో నయా మోసాలకు పాల్పడుతున్న కీర్తన గోల్డ్ లోన్ బ్యాంక్ యాజమాన్యం. ఖాతాదారుల నుండి గోల్డ్ ను తనఖా పెట్టుకుని, అధిక ధరలకు వేరే బ్యాంక్ లో తనఖా పెట్టీ లబ్ధి పొందుతున్న బ్యాంక్ సిబ్బంది. ప్రశ్నించే బాధితులకు మాకు సంబంధం లేదు లేదు అంటూ దర్జా గా నిర్లక్ష్యపు సమాధానం చెబుతూ.. తప్పించుకు తిరుగుతున్న బ్యాంక్ సిబ్బంది. బాధితులకు తగు న్యాయం చేస్తామంటూ సర్ది చెప్పిన చెన్నేకొత్తపల్లి మండల పోలీసులు.




