Kadiri: పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం.. ఎమ్మెల్యే కందికుంట!

Kadiri: కదిరి 30వ వార్డులో 'పేదల సేవలో' కార్యక్రమం. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఇంటింటికీ వెళ్లి అందజేసిన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్.

P.RAHAMTULLA, KADIRI
Published on: 1 Sept 2026 12:32 PM IST
Kadiri
X

Kadiri: పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం.. ఎమ్మెల్యే కందికుంట!

Kadiri: కదిరి పట్టణం 30వ వార్డులో “పేదల సేవలో” కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే , ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. డోర్ టు డోర్‌ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పెన్షన్లు అందజేశారు.

లబ్ధిదారులతో ఆత్మీయంగా మాట్లాడి వారి కుటుంబ పరిస్థితులను, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా వారికి అందుతున్న ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు. రెండేళ్ల కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పాలనను ప్రజలకు వివరిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.

పేదల ఇంటి వద్దకే వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయడం ప్రజాప్రతినిధిగా తన బాధ్యతగా భావిస్తున్నానని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI

Next Story