Kalyandurgam: ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు
Kalyandurgam: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జనసేన ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ.
Kalyandurgam: ఘనంగా మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు
కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ బాల్యం రాజేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో కేక్ కట్ చేసి, రోగులకు బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కళ్యాణదుర్గం జనసేన పార్టీ తరఫున చిరంజీవికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. స్వయంకృషితో సినీ రంగంలో అగ్రస్థానానికి ఎదిగి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న చిరంజీవి.. సేవా కార్యక్రమాలతోనూ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని నాయకులు పేర్కొన్నారు.
రక్తదానం, నేత్రదానం వంటి సేవా కార్యక్రమాలను ప్రోత్సహించడంతో పాటు ప్రకృతి విపత్తులు, కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో బాధితులకు అండగా నిలిచారని కొనియాడారు. నాలుగు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన చిరంజీవి.. క్రమశిక్షణ, అంకితభావం, నిరాడంబరతకు ప్రతీకగా నిలిచారని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు, కళ్యాణదుర్గం బీజేపీ అసెంబ్లీ ఇన్‌చార్జి ముప్పూరి దేవరాజు, టీడీపీ నాయకులు సునీల్ కుమార్, జనసేన నియోజకవర్గ, పట్టణ, మండల నాయకులు, వీరమహిళలు, జనసైనికులు, మెగా అభిమానులు, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




