Kalyandurg: కళ్యాణదుర్గం రూరల్ పీఎస్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

Kalyandurg: కళ్యాణదుర్గం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించి, గౌరవ వందనం సమర్పించిన ఇన్‌స్పెక్టర్ ఏ. గంగాధర్.

P.Sudhakar, Anantapuram
Updated on: 15 Aug 2026 12:36 PM IST
Kalyandurg
X

Kalyandurg: కళ్యాణదుర్గం రూరల్ పీఎస్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Kalyandurg: 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కళ్యాణదుర్గం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఏ. గంగాధర్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం స్టేషన్ సిబ్బంది జాతీయ పతాకానికి గౌరవం తెలిపారు.

ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ గంగాధర్ మాట్లాడుతూ దేశ స్వాతంత్య్ర కోసం అలుపెరుగని పోరాటం చేసిన స్వాతంత్య్ర సమరయోధులు, మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. వారు చూపిన మార్గంలో ప్రజా సేవకు అంకితమై పనిచేస్తామని తెలిపారు.

ప్రజల న్యాయం, ధన, మాన, ప్రాణ రక్షణకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ప్రజలకు నిర్భయమైన వాతావరణం కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. “ప్రజల కోసం మేమున్నాం” అనే నమ్మకాన్ని ప్రతి ఒక్కరిలో కల్పిస్తూ సేవలందిస్తామని తెలిపారు.అనంతరం పోలీస్ సిబ్బంది, ప్రజలకు 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

P.Sudhakar, Anantapuram

P.Sudhakar, Anantapuram

Next Story