Kalyanadurg: ముద్దినాయనపల్లిలో 'ఇంటింటికీ టీడీపీ' – ఎమ్మెల్యే సురేంద్రబాబు పర్యటన

Kalyanadurg: కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదూరు మండలం ముద్దినాయనపల్లిలో పర్యటించిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న వైనం.

P.Sudhakar, Anantapuram
Published on: 7 Aug 2026 4:33 PM IST
Kalyanadurg
X

Kalyanadurg: ముద్దినాయనపల్లిలో 'ఇంటింటికీ టీడీపీ' – ఎమ్మెల్యే సురేంద్రబాబు పర్యటన

కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు శుక్రవారం కంబదూరు మండలంలోని ముద్దినాయనపల్లి గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు టీడీపీ నాయకులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మహర్షి వాల్మీకి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం ఇంటింటికీ వెళ్లిన ఎమ్మెల్యే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ప్రజలకు వివరించారు. గ్రామస్తుల నుంచి రహదారులు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ తదితర సమస్యలపై వినతులు స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ గ్రామీణ రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో గ్రామీణ రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సవాళ్లతో ఉన్నప్పటికీ, ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి కళ్యాణదుర్గం నియోజకవర్గ సమస్యలను తీసుకెళ్లినట్లు తెలిపారు.

కళ్యాణదుర్గం వెనుకబడిన ప్రాంతంగా ఉండటంతో గ్రామీణ రహదారుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని కోరగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు. త్వరలోనే తారు రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని, గ్రామంలో సీసీ రహదారులు, తాగునీటి సదుపాయం, విద్యుత్ వంటి మౌలిక వసతులను మెరుగుపరచడానికి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు, మండల, గ్రామస్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

P.Sudhakar, Anantapuram

P.Sudhakar, Anantapuram

Next Story