Kalyandurg: కళ్యాణదుర్గంలో విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ ఎమ్మెల్యే
Kalyandurg: పాళ్లూరు ZPHSలో విద్యార్థులకు సైకిళ్లు అందజేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు. నియోజకవర్గంలో రూ.5 కోట్లతో 7,300 సైకిళ్ల పంపిణీ.
Kalyandurg: కళ్యాణదుర్గంలో విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ ఎమ్మెల్యే
కళ్యాణదుర్గం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్ కంబదూరు మండలం పాళ్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రామీణ విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎస్సార్సీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో సైకిళ్లు అందజేశారు. ఐదో రోజు నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలకు చెందిన 9, 10 తరగతులు, ఇంటర్ విద్యార్థులు పాఠశాలలకు నడుచుకుంటూ వెళ్లే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రూ.5 కోట్ల వ్యయంతో నియోజకవర్గ వ్యాప్తంగా 7,300 సైకిళ్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం వెనుక ఎస్సార్సీ సంస్థలో పనిచేస్తున్న 7 వేల మంది ఉద్యోగుల కృషి ఉందన్నారు.
కూటమి ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, కార్పొరేట్ స్థాయి మౌలిక వసతులతో పాటు యూనిఫాంలు, షూస్, బెల్ట్‌లు, బ్యాగులు, పుస్తకాలు, నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తోందన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత చదువులు చదివి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు పిల్లలను మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాకు దూరంగా ఉంచి చదువుపై దృష్టి పెట్టేలా ప్రోత్సహించాలని సూచించారు.
గత వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో రాజకీయాలు చేసిందని విమర్శించిన ఎమ్మెల్యే, అమ్మఒడి పథకానికి రూ.5,500 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు ఇంట్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి "తల్లికి వందనం" పథకం అమలు చేస్తూ రూ.10,190 కోట్లు కేటాయించిందని తెలిపారు. అలాగే 30 వేల మంది అంగన్‌వాడీ టీచర్లకు కూడా ఈ పథకం వర్తింపజేశామని చెప్పారు.
రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని, తిమ్మసముద్రం ప్రాంతంలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.




