Kalyandurg: కళ్యాణదుర్గంలో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
Kalyandurg: కళ్యాణదుర్గం ప్రజావేదికలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించి, అమరవీరులకు నివాళులర్పించిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు.
Kalyandurg: కళ్యాణదుర్గంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Kalyandurg: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ప్రజావేదికలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం సమర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు ఎంతో మంది మహనీయులు అలుపెరుగని పోరాటం చేశారని, వారి త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని అన్నారు.
స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని సూచించారు. వారు చూపిన మార్గంలో నడుస్తూ దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.స్వాతంత్ర్య సమరయోధులు కలలుగన్న సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
సమాజంలో ఐక్యత, దేశభక్తి, బాధ్యతాయుత పౌరసత్వం మరింత పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని కోరారు.
అనంతరం స్థానిక నాయకులతో కలిసి స్వాతంత్య్ర సమరయోధుల చిత్రపటాలకు ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. వారి సేవలను స్మరించుకుంటూ దేశం కోసం చేసిన త్యాగాలను కొనియాడారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన చిన్నారులకు స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నియోజకవర్గ ప్రజలకు 80వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రజావేదికలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.




