Kadiri: కదిరి శివాలయంలో హుండీ చోరీ!
Kadiri: కదిరి పట్టణంలోని చారిత్రాత్మక శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి మాడ వీధుల్లోని శివాలయంలో దొంగతనం.
Kadiri: కదిరి శివాలయంలో హుండీ చోరీ!
Kadiri: కదిరి పట్టణంలోని ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి మాడ వీదుల నందు గల శివాలయం గుడిలో హుండీలో ఉన్న డబ్బులు దొంగతనం చేసిన విషయములో కేసు నమోదు చేశారు కదిరి పోలీసులు.
శివాలయం గుడిలోని వాచ్ మెన్ అయిన నాగేంద్ర అను వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత రాత్రి సుమారు 01:30 నుండి 3:00 గంటల మధ్య తాను అక్కడ పడుకొని ఉండగా ఒక గుర్తు తెలియని వ్యక్తి శివాలయం గొడ దూకి వచ్చి తాను పడుకొని ఉన్న రూమ్ కు గడియ పెట్టి,
దేవాలయంలో గల రెండు హుండీ లలో ఒక హుండీ తాళం పగలగొట్టి అందులో నుండి సుమారు 15 వేల రూపాయలు దొంగలించుకొని వెళ్ళే సమయములో తనకు మెలుకవ వచ్చి దొంగను పట్టుకొని ప్రయత్నం చేస్తే దొంగ పారిపోయినాడని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Next Story




