Kadiri: బ్లూ మూన్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం

Kadiri: కదిరిలో మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా బ్లూ మూన్ విద్యాసంస్థల్లో ఘనంగా నిర్వహించిన క్రీడా దినోత్సవ వేడుకలు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 29 Aug 2026 4:29 PM IST
Kadiri
X

Kadiri: బ్లూ మూన్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం

కదిరి: సాయి జిల్లా కదిరి పట్టణంలోని బ్లూ మూన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా స్పోర్ట్స్ డే – 2026 వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. భారత హాకీ దిగ్గజం, “హాకీ విజార్డ్”గా పేరొందిన మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి కదిరి శాసనసభ్యులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బ్లూ మూన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్‌పర్సన్ శ్రీ మంచి శివశంకర్ గారు, సెక్రెటరీ శ్రీదేవి గారు, డైరెక్టర్ మౌనిక గారు పాల్గొని విద్యార్థులను అభినందించారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథి శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారు మాట్లాడుతూ, మేజర్ ధ్యాన్ చంద్ దేశానికి అందించిన క్రీడా సేవలు చిరస్మరణీయమని అన్నారు. ధ్యాన్ చంద్ తన ప్రతిభ, క్రమశిక్షణ, అంకితభావం, నిరంతర సాధనతో భారతదేశానికి ప్రపంచ స్థాయిలో గొప్ప గుర్తింపు తీసుకువచ్చారని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, జట్టు స్ఫూర్తిని పెంపొందిస్తాయని తెలిపారు.

బ్లూ మూన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్‌పర్సన్ శ్రీ మంచి శివశంకర్ గారు మాట్లాడుతూ, విద్యార్థుల సమగ్ర అభివృద్ధిలో క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. ప్రతి విద్యార్థిలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు సంస్థ తరఫున అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. మేజర్ ధ్యాన్ చంద్ జీవితం నేటి యువతకు ఆదర్శమని, ఆయన పట్టుదల, కృషి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం సురేందర్ రెడ్డి గారు, మాధవరెడ్డి గారు, మున్వర్ భాష గారు, ఇంచార్జ్ వనిత గారు, పీఈటీ రామాంజల రెడ్డి గారు, కరాటే మాస్టర్ షేక్షావలి గారు, బ్లూ మూన్ డిగ్రీ ప్రిన్సిపాల్ వెంకట రెడ్డి గారు, జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ మనోహర్ రెడ్డి గారు, పీఈటీ డానియల్ గారు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు ప్రదర్శించిన వివిధ క్రీడా కార్యక్రమాలు, సాంప్రదాయ కళలు, కరాటే విన్యాసాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. కరాటే విద్యార్థుల అద్భుతమైన విన్యాసాలు ప్రేక్షకులను అలరించాయి. విద్యార్థుల ప్రతిభను చూసి ముఖ్య అతిథులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.

క్రీడల్లో ప్రతిభ కనబరిచి విజయం సాధించిన విద్యార్థులకు మెడల్స్, ట్రోఫీలు, ప్రశంసా పత్రాలు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ క్రీడా ప్రతిభను చాటుకున్నారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI

Next Story