Nambulapulakunta: ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి అండగా ఉంటాం ఎమ్మెల్యే

Nambulapulakunta: నంబులపూలకుంట మండలం రైతు వెంకటేష్ ఆత్మహత్య. కదిరి ఏరియా ఆసుపత్రిలో మృతదేహాన్ని సందర్శించి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే కందికుంట.

P.RAHAMTULLA, KADIRI
Published on: 3 Aug 2026 2:52 PM IST
Nambulapulakunta
X

Nambulapulakunta: ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి అండగా ఉంటాం ఎమ్మెల్యే

నంబులపూలకుంట: శ్రీ సత్యసాయి జిల్లా నంబులపూలకుంట మండలం, గౌకనపల్లి గ్రామానికి చెందిన రైతు వేంకటేష్ అప్పుల భారం, వరుస పంట నష్టాలతో మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కదిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి చేరుకుని మృతుడి పార్థివదేహాన్ని సందర్శించి, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయాన్ని త్వరితగతిన అందేలా చర్యలు తీసుకుంటానని, అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI

Next Story