Kadiri: మిలాద్ ఉన్ నబి శాంతి ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే కందికుంట!
Kadiri: కదిరిలో మిలాద్ ఉన్ నబి శాంతి ర్యాలీలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
Kadiri: మిలాద్ ఉన్ నబి శాంతి ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే కందికుంట!
Kadiri: సర్వ మానవాళి శ్రేయస్సు, శాంతి, సోదరభావం కోసం మహమ్మద్ ప్రవక్త అందించిన సందేశాలను స్మరించుకుంటూ మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా మిలాద్ ఉన్ నబి పర్వదినాన్ని కదిరి పట్టణంలో ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన మిలాద్ ఉన్ నబి జూలూస్ (శాంతి ర్యాలీ)లో కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ ముస్లిం సోదరులతో కలిసి పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్న ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబి శుభాకాంక్షలు తెలియజేశారు.
మహమ్మద్ ప్రవక్త బోధించిన శాంతి, ప్రేమ, సోదరభావం, మానవత్వం వంటి విలువలు సమాజానికి ఆదర్శప్రాయమని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పేర్కొన్నారు. కదిరి నియోజకవర్గ ప్రజలందరూ పరస్పర సోదరభావంతో, ఐక్యతతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
Next Story




