Kadiri: వాయిస్ ఆఫ్ సిటిజన్స్.. ఎమ్మెల్యే కందికుంట వినూత్న ప్రయోగం!

Kadiri: శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 23 May 2026 6:13 PM IST
Kadiri
X

Kadiri: వాయిస్ ఆఫ్ సిటిజన్స్.. ఎమ్మెల్యే కందికుంట వినూత్న ప్రయోగం!

Kadiri: శ్రీ సత్య సాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మీ సమస్య మా బాధ్యత మీ సమస్యకు పరిష్కారం మా కర్తవ్యం నినాదంతో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా కదిరిలో వాయిస్ ఆఫ్ సిటిజన్స్ కార్యక్రమాన్ని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రారంభించారు. నియోజవర్గంలో ప్రజలు తమ సమస్యలను తెలపడానికి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రత్యేక చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు.

ఈ సందర్భంగా సమావేశంలో కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ పరిపాలనలో పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో వాయిస్ ఆఫ్ సిటిజన్స్ కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. ఒక పౌరుడు తమ సమస్యను నేరుగా తమ దృష్టికి తీసుకువచ్చేందుకు ప్రవేశపెట్టిన కార్యక్రమమే వాయిస్ ఆఫ్ సిటిజెన్స్ అని తెలిపారు. సామాన్యుడు ప్రభుత్వ కార్యాలయానికి పోవాలన్న తమ వద్దకు రావాలన్న ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు.

ఎమ్మెల్యే మా సమస్యకు దారి చూపిస్తాడన్న నమ్మకం కల్పించడమే తమ లక్ష్యమని పేదవాడు మనుగడ సులభతరం చేయడానికి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టామన్నారు. ఈ కార్యక్రమం ఆచరణలో కష్టాలు రావచ్చు... ఇబ్బందులు రావచ్చు అయినా కూడా సంకల్పంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI

Next Story