Kadiri: కదిరి జెడ్పీ బాలికల బడిలో 'మెగా పీటీఎం 4.0'
Kadiri: కదిరి జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో నిర్వహించిన మెగా పీటీఎం 4.0 లో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పాల్గొన్నారు.
Kadiri: కదిరి జెడ్పీ బాలికల బడిలో 'మెగా పీటీఎం 4.0'
Kadiri: సత్యసాయి జిల్లా కదిరి పట్టణం లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్–టీచర్స్ మీటింగ్ (Mega PTM 4.0) కార్యక్రమంలో కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వంపై సమానంగా ఉంటుందని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆధునిక మౌలిక వసతులు, మెరుగైన బోధన అందించేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న "తల్లికి వందనం" పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఆర్థిక చేయూత అందిస్తోందని, యూనిఫామ్‌లు, పాఠ్యపుస్తకాలు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కార్యక్రమం వంటి పథకాల ద్వారా ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేస్తోందని వివరించారు.




