Kadiri: పెడబల్లిలో 'ఇంటింటికీ తెదేపా' ప్రగతిని వివరించిన కందికుంట!
Kadiri: శ్రీసత్యసాయి జిల్లా పెడబల్లిలో కదిరి ఎమ్మెల్యే కందికుంట 'ఇంటింటికీ తెదేపా' కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను వివరించారు.
Kadiri: పెడబల్లిలో 'ఇంటింటికీ తెదేపా' ప్రగతిని వివరించిన కందికుంట!
Kadiri: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు సత్యసాయి జిల్లా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్.
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా నంబుల పూలకుంట మండలం పెడబల్లి గ్రామంలో నిర్వహించిన డోర్ టు డోర్ – ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా కలుసుకున్న ఎమ్మెల్యే గారు, కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, సమర్థ నాయకత్వంతో రాష్ట్రంలో అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, సంక్షేమ కార్యక్రమాలు సమన్వయంతో కొనసాగుతున్నాయని తెలిపారు.
ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.డీఎస్సీపై దుష్ప్రచారం చేయడం సరికాదు.
డీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులను చూసి ఓర్వలేక ప్రతిపక్ష నాయకులు డీఎస్సీపై దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ విమర్శించారు.
యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధానాలను ప్రోత్సహించాల్సింది పోయి, వాటిపై విషప్రచారం చేయడం బాధ్యతారాహిత్యమని అన్నారు.అభివృద్ధి పనులకు క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సహా రాష్ట్రంలో అనేక కీలక అభివృద్ధి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేగం పుంజుకున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన కూటమి ప్రభుత్వానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు.
కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు తాము చేసినట్టుగా క్రెడిట్ కొట్టేయడానికి ప్రతిపక్ష నాయకులు ప్రయత్నించడం హాస్యాస్పదమని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ విమర్శించారు.ప్రజలతో నేరుగా మమేకమై ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లడమే ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.




