Kadiri: కదిరిలో నూతన 'నివ్య మారుతి సుజుకి' కార్ షోరూమ్ ప్రారంభం!
Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో 'నివ్య మారుతి సుజుకి' కార్ షోరూమ్‌ను ఎమ్మెల్యే కందికుంట ప్రారంభించారు. దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి పెరుగుతుందన్నారు.
Kadiri: కదిరిలో నూతన 'నివ్య మారుతి సుజుకి' కార్ షోరూమ్ ప్రారంభం!
కదిరిలో నివ్య మారుతి సుజుకి కార్ షోరూం ప్రారంబించిన ఎమ్మెల్యే
సత్యసాయి జిల్లా కదిరి పట్టణం మదనపల్లి రోడ్డులోని మైనార్టీ ఫంక్షన్ హాల్ ప్రక్కన నూతనంగా ఏర్పాటు చేసిన నివ్య మారుతి సుజుకి కార్ షోరూంను కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ రిబ్బన్ కటింగ్ చేసి ఘనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు చెంచయ్య నాయుడు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కదిరిలో కొత్త వ్యాపార సంస్థలు ఏర్పడడం ప్రాంతీయ అభివృద్ధికి, స్థానిక యువతకు ఉపాధి అవకాశాల పెరుగుదలకు దోహదపడుతుందని పేర్కొన్నారు. నివ్య మారుతి సుజుకి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, సంస్థ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
Next Story




