Kadiri: కదిరి కొండపై భక్తుల గిరి ప్రదక్షిణ.. ప్లాస్టిక్ నిషేధం!
Kadiri: కదిరి లక్ష్మీ నారసింహ స్వామి జన్మ నక్షత్రం సందర్భంగా భక్తులు భారీగా గిరి ప్రదక్షిణ చేశారు. కొండ చుట్టూ రోడ్డు మార్గ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు.
Kadiri: కదిరి కొండపై భక్తుల గిరి ప్రదక్షిణ.. ప్లాస్టిక్ నిషేధం!
కదిరి: తలచినంతనే మోక్షం ప్రసాదించే ఆ ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు కాటమ రాయుడుగా కొండల లక్ష్మీ నారసింహుడుగా కుమ్మరవాండ్లపల్లి గ్రామంలో కదిరి కొండపై ( స్తోత్రాద్రి ) మొదట పాదం మోపారని అందుకే భక్తులు ఇక్కడ శ్రీ వారిని ఖాద్రీ లక్ష్మీ నారసింహుడుగా కొలుస్తున్నారని శ్రీ వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రతి నెలా పెద్దఎత్తున శ్రీ వారి భక్తులు గిరి ప్రదక్షిణలో పాల్గొనటం జరుగుతోంది.
శ్రీ వారి స్తోత్రాద్రి గిరిప్రదక్షిణలో పాల్గొనే భక్తుల సౌకర్యార్థం కదిరి కొండ చుట్టూ రహదారి మార్గానికి పూనుకున్న కదిరి నియోజకవర్గం శాసన సభ్యులు కందికుంట వెంకటప్రసాద్ గారికి శ్రీ వారి భక్తుల తరపున మరియు శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి తరపున కృతజ్ఞతలు తెలిపారు.
ప్రతి నెలా శ్రీ వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం రోజున గిరి ప్రదక్షిణలో పాల్గొనే భక్తులకు దాతల సహకారంతో మహా ప్రసాద వితరణ , శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి తరపున మజ్జిగ ప్యాకెట్లను , మంచినీటి ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు.కదిరి తహసీల్దార్ రెడ్డి శేఖర్ శ్రీ వారి కొండకి ప్రత్యేక హారతి ఇచ్చి గోవింద నామస్మరణతో భక్తులతో పాటుగా గిరిప్రదక్షిణలో పాల్గొన్నారు.
నేటి నుంచి పర్యావరణం పరిరక్షణలో భాగంగా కొండల లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ప్లాస్టిక్ నిర్మూలన కోసం దాతల సహకారంతో పేపర్ ప్లేట్లు , ప్లాస్టిక్ గ్లాసులు నిషేధించి వాటి స్థానంలో స్టీల్ ప్లేట్లను, స్టీల్ గ్లాసులను ప్రవేశ పెట్టడం జరిగింది
స్తోతాద్రి గిరి ప్రదక్షిణ రోడ్డు మార్గ నిర్మాణంలో సహకరించిన ప్రభుత్వ అధికారులకు , ఆలయ అధికారులకు , పట్టణ ప్రముఖులకు శ్రీ వారి భక్తులు , శ్రీ ఖాద్రీ లక్ష్మీ నృసింహ సేవా సమితి సభ్యులు అభినందనలు తెలపడం జరిగింది.




