Kadiri: కదిరి జనసేన ఇన్‌చార్జ్ భైరవ ప్రసాద్‌పై కేసు నమోదు

Kadiri: శ్రీసత్యసాయి జిల్లా కదిరి జనసేన పార్టీ ఇన్‌చార్జ్, లాయర్ భైరవ ప్రసాద్‌పై పోలీసులు గృహహింస కేసు నమోదు చేశారు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 18 May 2026 6:03 PM IST
Kadiri
X

Kadiri: కదిరి జనసేన ఇన్‌చార్జ్ భైరవ ప్రసాద్‌పై కేసు నమోదు

Kadiri: కదిరి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ భైరవ ప్రసాద్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. న్యాయవాది వృత్తిలో ఉన్న భైరవ ప్రసాద్ శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడని భార్య శషికళ, కుమార్తె సాయి వర్షిణి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తన భర్త తనను నిరంతరం శారీరకంగా, మానసికంగా వేధించడమే కాకుండా, చెడు అలవాట్లు కలిగి ఉండటాన్ని తాను ప్రశ్నించిన విషయంలో తనతో గొడవ పెట్టుకుని ఇనుపరాడుతో తలపైన, శరీరము పైన ఇష్టానుసారం కొట్టి గాయాలు కలగజేశాడని,

అడ్డు వచ్చిన తన కూతురు సాయి వర్షినిని కూడా కొట్టాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI

Next Story