Kadiri: పవన్ కళ్యాణ్‌పై ప్రాంతీయవాద వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం
Kadiri: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై తెలంగాణకు చెందిన కొందరు నేతలు, యూట్యూబ్ ఛానెళ్ల ప్రతినిధులు చేస్తున్న ప్రాంతీయవాద వ్యాఖ్యలపై కదిరి జనసేన నియోజకవర్గ ఇన్చార్జి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Kadiri: పవన్ కళ్యాణ్‌పై ప్రాంతీయవాద వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం
Kadiri: కదిరి జనసేన ఇన్చార్జి భైరవప్రసాద్ మాట్లాడుతూ మా అధినేత పవన్ కళ్యాణ్ గారిపై తెలంగాణ కుహనా మేధావులు, యూట్యూబ్ ఛానెల్స్ ప్రతినిధులు, కొద్దిమంది MLA లు చేస్తున్న ప్రాంతీయవాద వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కదిరి నియోజకవర్గం జనసేనపార్టీ తరుఫున కోరుతున్నామన్నారు, లేదంటే తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు. వరదలు వచ్చినప్పుడు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు మెగా ఫ్యామిలీ అలాగే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రనికి సహాయం చేయలేదా, అలాగే కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంకు తన ప్రత్యేక చొరవతో 35 కోట్ల రూపాయలు టీటీడీ నుంచి విడుదల చేయించి అభివృద్ధి పనులు చేపట్టినప్పుడు ఈ కుహానా ప్రాంతీయవాదులు నోర్లు పడిపోయాయా అని ప్రశ్నించారు, అప్పుడు లేని ప్రాంతీయవాదం ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారో, తెలంగాణా ప్రజలు అర్థం చేసుకోనీ మిమ్మల్ని తరిమే కాలం తొంధరలోనే ఉందని, మీ తప్పు మీరు తెలుసుకొని మీ మాటలు వెనక్కి తీసుకోవాలని కదిరి నియోజకవర్గం జనసేనపార్టీ ఇన్చార్జి భైరవ ప్రసాద్ డిమాండ్ చేశారు.




