Kadiri: మా సమస్యను రాజకీయం చేయకండి: జనసేన ఇన్చార్జ్ సతీమణి
Kadiri: కదిరి జనసేన పార్టీ ఇన్చార్జ్ భైరవ ప్రసాద్ కుటుంబ వివాదం పెద్దల సమక్షంలో సుఖాంతమైంది.
Kadiri: మా సమస్యను రాజకీయం చేయకండి: జనసేన ఇన్చార్జ్ సతీమణి
Kadiri: కుటుంబ పెద్దలు మరియు మధ్యవర్తుల సమక్షంలో పరస్పర చర్చల ద్వారా, మా ఇద్దరి మధ్య నెలకొన్న విభేదాలు స్నేహపూర్వకంగా పరిష్కరించబడ్డాయి. ప్రస్తుతం మేము ఎటువంటి విభేదాలు లేకుండా శాంతియుతంగా కలిసి జీవించేందుకు నిర్ణయించుకున్నాము.
అందువల్ల, మా ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసును రాజీ పద్ధతిలో ముగించేందుకు అవసరమైన న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నాము. ఈ నిర్ణయం పూర్తిగా మా స్వచ్ఛందంతో, ఎలాంటి ఒత్తిడి లేదా బలవంతం లేకుండా తీసుకున్నదని తెలియజేస్తున్నాము.
అయితే, మా భార్యాభర్తల మధ్య జరిగిన వ్యక్తిగత కుటుంబ సమస్యలను కొందరు రాజకీయ కోణంలో ప్రచారం చేయడం, నా భర్తపై తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం చాలా దురదృష్టకరం. మా కుటుంబ సమస్యను ప్రతి కుటుంబంలో జరిగే సాధారణ చిన్న సమస్యగా మాత్రమే చూడాలని కోరుకుంటున్నాము.
నా భర్త రాజకీయాల్లో ఉన్న కారణంగా, ఈ వ్యక్తిగత కుటుంబ విషయాన్ని రాజకీయాలకు ముడిపెట్టడం సమంజసం కాదని, దయచేసి ఈ అంశాన్ని అనవసర రాజకీయ ప్రచారానికి ఉపయోగించవద్దని ఈ మీడియా ప్రకటన ద్వారా బహిరంగంగా విజ్ఞప్తి చేస్తున్నానని కదిరి జనసేన ఇంచార్జ్ న్యాయవాది భైరవప్రసాద్ సతీమణి తెలిపారు.




