Kadiri: దేశభక్తి నడుమ కదిరిలో 1000 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ!
Kadiri: సత్యసాయి జిల్లా కదిరిలో 1000 అడుగుల త్రివర్ణ పతాకంతో హర్ ఘర్ తిరంగా ర్యాలీ. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ హాజరు.
Kadiri: దేశభక్తి నడుమ కదిరిలో 1000 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ!
Kadiri: దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా సత్యసాయి జిల్లా కదిరిలో 1000 అడుగుల భారీ త్రివర్ణ పతాకంతో తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు.
కదిరి మున్సిపల్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీలో కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ మౌర్య భరద్వాజ్ పాల్గొన్నారు.
ర్యాలీలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొని త్రివర్ణ పతాకాలను పట్టుకుని “వందేమాతరం”, “భారత్ మాతాకీ జై” అంటూ దేశభక్తి నినాదాలు చేశారు. 1000 అడుగుల త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుండగా కదిరి పట్టణం దేశభక్తి భావంతో మార్మోగింది.
కదిరి మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ జ్యోతిరావు పూలే సర్కిల్ మీదుగా అంబేద్కర్ సర్కిల్ వరకు కొనసాగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ, జాతీయ జెండా మన దేశ గౌరవానికి, ఐక్యతకు ప్రతీక అని, ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తి స్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.




