Kadiri: కదిరి 22వ వార్డులో నిసార్ యాసీన్ పర్యటన!
Kadiri: కదిరి 22వ వార్డులో పర్యటించిన సిమ్స్ హాస్పిటల్ MD, NYPSN ఫౌండర్ నిసార్ యాసీన్. 300 ఇళ్లను సందర్శించి 6 పేద కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేత.
Kadiri: కదిరి 22వ వార్డులో నిసార్ యాసీన్ పర్యటన!
Kadiri: కదిరి పట్టణంలోని సిమ్స్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, NYPSN ఫౌండర్ నిసార్ యాసీన్ కదిరి మున్సిపాలిటీ 22వ వార్డులో పర్యటించారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టిన ఆయన వార్డులో పర్యటించి ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సుమారు 300 ఇళ్లను సందర్శించి, కుటుంబాల సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు.
ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న 6 కుటుంబాలను గుర్తించి వారికి ఆర్థిక సహాయం అందించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, అవసరమైన వారికి తన శక్తి మేరకు అండగా నిలుస్తానని నిసార్ యాసీన్ తెలిపారు.
ఈ సందర్భంగా అయాజ్, అంజార్, అల్లాబకాశ్, ఇబ్రహీమ్, ఇస్మాయిల్, సిద్ధిక్, ఫరూక్, అస్లాం, షాకీర్ తదితరులతో పాటు వందలాది మంది యువకులు పాల్గొని నిసార్ యాసీన్కు పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు.
నిసార్ యాసీన్ మాట్లాడుతూ, “ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడం నా బాధ్యత అని అవసరమైన ప్రతి కుటుంబానికి నా శక్తి మేరకు అండగా నిలిచి ప్రజలకు సేవ చేయడం నా లక్ష్యం” అని అన్నారు.




