Pamidi: ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆదేశాలతో వార్డుల్లో టీడీపీ ప్రచారం!

Pamidi: పామిడి 7వ వార్డులో గుమ్మనూరు జయరాం ఆదేశాలతో 'ఇంటింటికి తెలుగుదేశం' సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 5 Sept 2026 12:24 PM IST
Pamidi
X

Pamidi: ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆదేశాలతో వార్డుల్లో టీడీపీ ప్రచారం!

Pamidi: అనంతపురం జిల్లా పామిడి, సెప్టెంబర్ 05: గుంతకల్లు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గుమ్మనూరు జయరాం గారు మరియు యువనేత, గుత్తి & పామిడి ఇంచార్జ్ శ్రీ గుమ్మనూరు ఈశ్వర్ గారి ఆదేశాల మేరకు పామిడి పట్టణంలోని 7వ వార్డులో "ఇంటింటికి-తెలుగుదేశం" కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ కార్యక్రమంలో భాగంగా టీడీపీ నాయకులు ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. సూపర్ సిక్స్ పథకాలు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలపై కరపత్రాలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సెల్ సెక్రెటరీ కరూర్ శివశంకర్, పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు దాసరి నిరంజన్, గడ్డం షెక్షావలి, 238వ బూత్ కన్వీనర్ జాఫర్ సాహెబ్, 237వ బూత్ కన్వీనర్ చల్లా రామకృష్ణ, 239వ బూత్ కన్వీనర్ కరూర్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL

Next Story