Anantapur: ఏంగణపల్లిలో 'హార్టికల్చర్ ప్లాంటేషన్ డే'!
Anantapur: గుత్తి మండలం ఏంగణపల్లిలో ఉపాధి హామీ ఆధ్వర్యంలో హార్టికల్చర్ ప్లాంటేషన్ డే ఘనంగా జరిగింది. రైతులకు సాగుపై ఎంపీడీఓ ప్రభాకర్ అవగాహన కల్పించారు.
Anantapur: ఏంగణపల్లిలో 'హార్టికల్చర్ ప్లాంటేషన్ డే'!
గుత్తి ఏంగణపల్లిలో హార్టికల్చర్ ప్లాంటేషన్ డే
- VPB Ram g ఉపాధి హామీ పథకంలో భాగంగా మొక్కలు నాటిన అధికారులు
అనంతపురం జిల్లా గుత్తి మండలం ఏంగణపల్లి గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా *హార్టికల్చర్ ప్లాంటేషన్ డే సందర్భంగా కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ ప్రభాకర్ గారు ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతులకు ఉపాధి కల్పించడంతో పాటు, ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు.
గ్రామంలో సాగునీటి సదుపాయం ఉన్న రైతుల పొలాల్లో ఉద్యాన మొక్కలను నాటడం ద్వారా రైతుల ఆదాయం పెంపు, పచ్చదనం పెంచడం లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఎంపీడీఓ ప్రభాకర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, ఉపాధి హామీ సిబ్బంది, APO రమేష్,టెక్నికల్ అసిస్టెంట్ గుణశేఖర్., EC ప్రభాకర్., మల్లికార్జున.రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




