Pamidhi: వర్షాల కోసం హిందూ, ముస్లింల ప్రార్థనలు: పామిడిలో మత సామరస్యం!

Pamidhi: పామిడిలో మత సామరస్యం వెల్లివిరిసింది. వర్షాలు కురవాలని కోరుతూ హిందువులు వరుణ జపాలు చేయగా, ముస్లింలు ప్రత్యేక ఇస్తిస్కా నమాజ్ నిర్వహించారు.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 6 Sept 2026 6:51 PM IST
Pamidhi
X

Pamidhi: వర్షాల కోసం హిందూ, ముస్లింల ప్రార్థనలు: పామిడిలో మత సామరస్యం!

పామిడి: వర్షాల కోసం అనంతపురం జిల్లా పామిడిలో హిందువులు వరుణ దేవునికి పూజలు చేస్తుంటే, ముస్లిం సోదరులు సైతం వర్షాలు కురవాలని అల్లాహ్ ను వేడుకుంటూ ప్రత్యేక నమాజ్ ప్రార్థనలు చేశారు.

ఈ ఏడాది వర్షాలు సరిగా లేక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్న నేపథ్యంలో పామిడి పట్టణంలో ఈ ప్రార్థనలు జరిగాయి. హిందువులు ఆలయాల్లో వరుణ యాగం, పూజలు నిర్వహిస్తుండగా, ముస్లింలు మసీదుల్లో వర్షం కోసం ప్రత్యేక ప్రార్థనలు (ఇస్తిస్కా నమాజ్) చేశారు.

కులమతాలకు అతీతంగా అందరూ వర్షం కోసం ప్రార్థించడం మత సామరస్యానికి నిదర్శనంగా నిలిచింది. త్వరలో వర్షాలు కురిసి పంటలు పండాలని, రైతుల కష్టాలు తీరాలని వారు ఆకాంక్షించారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL

Next Story