Guntakal: గుంతకల్లు టీడీపీలో అంతర్మథనం: పాత కార్యకర్తల ఆవేదన!

Guntakal: అనంతపురం జిల్లా గుంతకల్లు టీడీపీలో హాట్ టాపిక్‌గా మారిన పాత, కొత్త కార్యకర్తల మధ్య దూరం. స్థానిక ఎన్నికల వేళ సీనియర్ల ఆవేదనపై కొనసాగుతున్న అంతర్మథనం.

LALU PRASAD NAYAK, GUNTAKAL
Published on: 22 Aug 2026 11:36 AM IST
Guntakal
X

Guntakal: గుంతకల్లు టీడీపీలో అంతర్మథనం: పాత కార్యకర్తల ఆవేదన!

Guntakal: అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఆసక్తికరంగా మారింది. ఈ నియోజకవర్గం పరిధిలో గుంతకల్లు, గుత్తి, పామిడి మూడు మండలాలు ఉన్నాయి. టీడీపీ ఆవిర్భావం 1982 నుండి ఇప్పటివరకు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని, ఆస్తులు పోగొట్టుకుని, కేసులు భరించి పార్టీ జెండాను భుజాన మోసిన కార్యకర్తలు ఈ నియోజకవర్గంలో వందలాది మంది ఉన్నారు.

అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితి మారిందనే చర్చ జోరుగా సాగుతోంది. టీడీపీ కోసం దశాబ్దాలుగా కష్టపడిన పాత కార్యకర్తలను కాకుండా, తాను గుంతకల్లుకు వచ్చిన తర్వాత తన కోసం పనిచేసిన కొత్త వారికే ప్రాధాన్యం ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

"పార్టీ స్థాపించినప్పటి నుండి కష్టపడిన వారు నాకు వద్దు.. నేను గుంతకల్లు నియోజకవర్గం తరపున పోటీ చేసినప్పటి నుండి నా కోసం కష్టపడిన వారే నాకు కావాలి" అని బహిరంగంగా చెప్పుకుంటున్నారనే ప్రచారం పాత కార్యకర్తల్లో తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. దీంతో దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న సీనియర్ కార్యకర్తలు, కుటుంబాలు తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఈ విభేదాలు పార్టీకి నష్టం చేస్తాయా అనే చర్చ మొదలైంది. మరి నియోజకవర్గ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ కలుపుకొని ముందుకు వెళ్తారా? లేక తాను వచ్చిన నాటి నుండి ఉన్న అనుచరులకే ప్రాధాన్యత ఇస్తారా? అనేది వేచి చూడాలి.

పాత-కొత్తల మధ్య సమన్వయం లోపిస్తే స్థానిక ఎన్నికల్లో ప్రభావం పడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ అధిష్టానం జోక్యం చేసుకొని అందరినీ కలుపుకొని పోవాలని సీనియర్ కార్యకర్తలు కోరుతున్నారు.

LALU PRASAD NAYAK, GUNTAKAL

LALU PRASAD NAYAK, GUNTAKAL

Next Story