Guntakal: గుంతకల్లు అన్న క్యాంటీన్‌లో కమిషనర్ లక్ష్మీ దేవి తనిఖీ

Guntakal: అనంతపురం జిల్లా గుంతకల్లు మున్సిపల్ కమిషనర్ లక్ష్మీ దేవి అన్న క్యాంటీన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 17 July 2026 8:55 AM IST
Guntakal
X

Guntakal: గుంతకల్లు అన్న క్యాంటీన్‌లో కమిషనర్ లక్ష్మీ దేవి తనిఖీ

Guntakal: అనంతపురం జిల్లా గుంతకల్లు పురపాలక సంఘం పరిధిలోని అన్న క్యాంటీన్ ను మున్సిపల్ కమిషనర్ లక్ష్మీ దేవి గారు మరియు సానిటరీ ఇన్స్పెక్టర్ బాషా గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా క్యాంటీన్ లోని ఆహార నాణ్యత, పరిశుభ్రత, వంట సామాగ్రి నిల్వలు, వంటగది శుభ్రతను కమిషనర్ గారు పరిశీలించారు. క్యాంటీన్ కు వచ్చే లబ్ధిదారుల నుండి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.

పేదలకు రూ.5 కే నాణ్యమైన భోజనం అందుతుందని అధికారులు తెలిపారు. క్యాంటీన్ లో పరిశుభ్రత మరింత మెరుగుపరచాలని, నిర్ణీత సమయాల్లోనే ఆహారం అందించాలని కమిషనర్ లక్ష్మీ దేవి గారు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలయ్యేలా చూడాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో క్యాంటీన్ సిబ్బంది, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL

Next Story