Guntakal: రూ. 4.23 కోట్లతో బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే భూమిపూజ!
Guntakal: ఆలూరు రోడ్డు నుండి బంటనహాల్ వరకు రూ.4.23 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ.
Guntakal: రూ. 4.23 కోట్లతో బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే భూమిపూజ!
Guntakal: గుంతకల్లు ఆలూరు రోడ్డు నుండి బంటనహాల్ వరకు 4 కోట్ల 23 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు భూమి పూజ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి గుంతకల్లు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గుమ్మనూరు జయరాం ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో అనంతపురం ఎంపీ శ్రీ అంబికా లక్ష్మీనారాయణ , గుంతకల్లు మండల ఇంచార్జ్ మరియు ఎమ్మెల్యే సోదరుడు శ్రీ గుమ్మనూరు నారాయణస్వామి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో భాగంగా గుంతకల్లు - ఆలూరు నుండి బంటనహాల్ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టామని, ఇక ముందు కూడా అభివృద్ధి పనులను చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గుంతకల్లు మండల మరియు పట్టణ కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




