Guntakal: గుంతకల్లులో ₹1.25 కోట్లతో ఐపీహెచ్ ల్యాబ్ ప్రారంభం: ఎమ్మెల్యే జయరాం

Guntakal: గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో ₹1.25 కోట్లతో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌ను ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, ఎంపీ అంబిక ప్రారంభించారు.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 12 Sept 2026 3:50 PM IST
Guntakal
X

Guntakal: గుంతకల్లులో ₹1.25 కోట్లతో ఐపీహెచ్ ల్యాబ్ ప్రారంభం: ఎమ్మెల్యే జయరాం

గుంతకల్లు: గుంతకల్లు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రూ.1.25 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్ను శనివారం గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులకు ఆసుపత్రి సిబ్బంది ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య పరీక్షలను ఉచితంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇంటిగ్రేటెడ్ ల్యాబ్‌ ద్వారా ఒకే చోట రక్తం, మూత్రం, మైక్రోబయాలజీ, పాథాలజీ, బయోకెమిస్ట్రీతో పాటు వ్యాధి నిర్ధారణకు సంబంధించిన అనేక రకాల అధునాతన పరీక్షలను ఉచితంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

గతంలో కొన్ని సంక్లిష్టమైన వైద్య పరీక్షల కోసం ఇతర ప్రాంతాలకు లేదా ప్రైవేట్ ల్యాబ్‌లకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, ఇకపై గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలోనే పరీక్షలు నిర్వహించి త్వరితగతిన ఖచ్చితమైన ఫలితాలు అందించే అవకాశం కలిగిందని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ సదుపాయాన్ని గుంతకల్లు నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

కార్యక్రమంలో గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యాధికారులు, సిబ్బందితో పాటు గుంతకల్లు పట్టణ, మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL