Guntakal: రూ. 50 లక్షలతో పెద్ద కదిరప్ప స్వామి ఆలయ ఆవరణలో అభివృద్ధి పనులు!

Guntakal: ఎన్.వెంకటంపల్లి పెద్ద కదిరప్ప స్వామి ఆలయ వద్ద రూ. 50 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించిన గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 5 Sept 2026 3:00 PM IST
Guntakal
X

Guntakal: రూ. 50 లక్షలతో పెద్ద కదిరప్ప స్వామి ఆలయ ఆవరణలో అభివృద్ధి పనులు!

Guntakal: అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం ఎన్.వెంకటంపల్లి గ్రామంలో ప్రసిద్ధి చెందిన పెద్ద కదిరప్ప స్వామి దేవాలయ ఆవరణంలో రూ. 50 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన సీసీ రోడ్డును గుంతకల్లు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గుమ్మనూరు జయరాం శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో గుంతకల్లు మండల ఇంచార్జ్, ఎమ్మెల్యే సోదరులు శ్రీ గుమ్మనూరు నారాయణస్వామి కలిసి రిబ్బన్ కట్ చేసి రోడ్డును ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధిలో భాగంగా 50 లక్షల రూపాయలతో సీసీ రోడ్డును నిర్మించి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు.

నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టామని, ఇకముందు కూడా అభివృద్ధి పనులను చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తామని తెలిపారు. భక్తులకు, గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాలయ ఆవరణాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో గుంతకల్లు మండల మరియు పట్టణ కూటమి నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL

Next Story