Guntakal: కసాపురంలో ఘనంగా అమోగ్ హోటల్ ప్రారంభోత్సవం
Guntakal: అనంతపురం జిల్లా కసాపురం దేవస్థానం ఎదుట అమోగ్ హోటల్ ప్రారంభం. ముఖ్య అతిథిగా పాల్గొన్న వైఎస్ఆర్సీపీ గుంతకల్ యువనేత సీబీ మంజునాథ రెడ్డి.
Guntakal: కసాపురంలో ఘనంగా అమోగ్ హోటల్ ప్రారంభోత్సవం
గుంతకల్లు: అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం గుంతకల్లు మండలం కసాపురం దేవస్థానం ఎదుట నూతనంగా ఏర్పాటు చేసిన అమోగ్ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ గుంతకల్ నియోజకవర్గ యువనేత CB మంజునాథ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి హోటల్ ను ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి, దీపం వెలిగించి వ్యాపార యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కసాపురం సీనియర్ నాయకులు సోమిరెడ్డి, తిక్కస్వామి, మనోహర్, వంశీ యాదవ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కసాపురంలో కొత్త హోటల్ రావడం వల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయని నాయకులు ఆకాంక్షించారు.
Next Story




