Guntakal: కసాపురం ఆంజనేయ స్వామి ఆలయంలో భూమి పూజ చేసిన ఎమ్మెల్యే!
Guntakal: కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, నాయకులు.
Guntakal: కసాపురం ఆంజనేయ స్వామి ఆలయంలో భూమి పూజ చేసిన ఎమ్మెల్యే!
Guntakal: అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలో వెలసిన శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా శుక్రవారం భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంతకల్లు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గుమ్మనూరు జయరాం హాజరయ్యారు.
ముందుగా గుంతకల్లు మండల ఇంచార్జ్ శ్రీ గుమ్మనూరు నారాయణ స్వామి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా. పత్తి హిమబిందు హాజరయ్యారు. పురోహితులు, గుంతకల్లు పట్టణ, మండల కూటమి నాయకులు వారికి ఘన స్వాగతం పలికారు.
అనంతరం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ "కసాపురం గ్రామంలో వెలసిన శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారికి నిత్యం పూజలు జరుగుతున్నాయి. ఇక్కడికి నిత్యం భక్తులు వస్తుంటారు. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే ఈ రోజు భూమి పూజ చేయడం జరిగింది. భక్తులకు వసతి గృహాలు ఏర్పాటు చేసేందుకు సహాయ సహకారాలు అందించిన ప్రతి దాతకు కూటమి ప్రభుత్వం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఆలయ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను" అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కసాపురం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, గుంతకల్లు పట్టణ, మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, అనుబంధ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.




