Gorantla: గోరంట్ల-హిందూపురం జాతీయ రహదారి పనులను వేగవంతం చేసిన మంత్రి సవిత
Gorantla: రూ. 500 కోట్లతో చేపడుతున్న గోరంట్ల-హిందూపురం జాతీయ రహదారి పనులను మంత్రి సవిత వేగవంతం చేసి, పూర్తయిన రహదారిని ప్రారంభించారు.
Gorantla: గోరంట్ల-హిందూపురం జాతీయ రహదారి పనులను వేగవంతం చేసిన మంత్రి సవిత
గోరంట్ల: పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలం నుంచి హిందూపురం వరకు సుమారు 30 కిలోమీటర్ల మేర రూ.500 కోట్ల వ్యయంతో చేపడుతున్న జాతీయ రహదారి పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
రహదారి నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో గోరంట్ల పట్టణంలోకి భారీ వాహనాల రాకపోకలు పెరగడంతో ట్రాఫిక్ సమస్యలతో పాటు ప్రమాదాలు చోటుచేసుకుంటున్న విషయాన్ని స్థానికులు మంత్రి సవిత దృష్టికి తీసుకువచ్చారు.
దీనిపై వెంటనే స్పందించిన మంత్రి సవిత జాతీయ రహదారి అధికారులతో మాట్లాడి, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రహదారి పనులను ప్రాధాన్యతతో చేపట్టాలని సూచించారు.ఈ క్రమంలో పూర్తయిన రహదారి పనులను మంత్రి సవిత అధికారులతో, స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు.
జాతీయ రహదారి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే గోరంట్ల, హిందూపురం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుందని మంత్రి సవిత తెలిపారు.
ప్రజల భద్రత, సౌకర్యమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి సవిత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హైవే అధికారులు గోరంట్ల మండల కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు...




