Gooty: గుత్తిలో డాక్యుమెంట్ రైటర్ల దీక్షలకు వైసిపి మద్దతు
Gooty: గుత్తి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ వద్ద డాక్యుమెంట్ రైటర్ల నిరాహార దీక్ష. వైసిపి నేత నైరుతి రెడ్డి సంఘీభావం, డిమాండ్ల పరిష్కారానికి విజ్ఞప్తి.
Gooty: గుత్తిలో డాక్యుమెంట్ రైటర్ల దీక్షలకు వైసిపి మద్దతు
గుత్తి: అనంతపురం జిల్లా గుత్తి సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద వివిధ డిమాండ్లతో డాక్యుమెంట్ రైటర్లు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు వైసిపి నేతలు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా వైసిపి జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి, గుత్తి వైసిపి నాయకులు దీక్షా శిబిరాన్ని సందర్శించి డాక్యుమెంట్ రైటర్లతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి డాక్యుమెంట్ రైటర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని నైరుతి రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజలకు సేవలు అందించే డాక్యుమెంట్ రైటర్ల సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. వారి పోరాటానికి వైసిపి పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గుత్తి వైసిపి నాయకులు, కార్యకర్తలు, డాక్యుమెంట్ రైటర్లు తదితరులు పాల్గొన్నారు.
Next Story




